రెండు రోజుల్లో గద్దర్ అవార్డుల నోటిఫికేషన్..?

TG: మరో రెండు రోజుల్లో గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాజు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది.

Editor