ఆర్డీటీ ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ కోరుతూ ‘ప్రజాబలం సంఘం’ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర – రామప్ప నాయక్
బెలుగుప్ప మండలం మార్చి 3 న్యూస్:-
ఆర్డీటీ సంస్థ ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్‌ను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాబలం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామప్ప నాయక్ చేపట్టిన రథయాత్ర మరియు సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.
ఆర్డీటీ సంస్థ పురుడు పోసుకున్న పుణ్యభూమి బ్రాహ్మణపల్లి తాండ గ్రామం నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర, ప్రస్తుతం నియోజకవర్గంలోని పల్లె పల్లెకు చేరుకుంటోంది. ఈ సందర్భంగా రామప్ప నాయక్ మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా అనంతపురం జిల్లా అభివృద్ధిలో, పేదల అభ్యున్నతిలో ఆర్డీటీ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.
ప్రజా మద్దతు: ప్రతి గ్రామంలోనూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు.
కలెక్టరేట్ ముట్టడి: ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున సంతకాల సేకరణ అర్జీలను సమర్పించే కార్యక్రమం ఉంటుంది.
ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎనిమిదో తారీఖున అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలిరావాలని రామప్ప నాయక్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాబలం సంఘం రాష్ట్ర కన్వీనర్ బంధం రమేష్ జిల్లా మహిళా కన్వీనర్ మైమున ఉరవకొండ నియోజకవర్గం కన్వీనర్ అనిఫ్ గ్రామంలో ఉన్న పెద్దలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
