అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం.
పప్పుసెనగ కొనుగోలుకు ఏర్పాట్లు
కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాయదుర్గం
ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుండి కనేకల్లు మండల కేంద్రంలో పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలియజేశారు. క్వింటాలు కనీస మద్దతు ధర రూ.5875గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కనేకల్లు మండల మండలంలో 23,604 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పప్పుసేనగ సాగు చేశారన్నారు. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు. ఇప్పటి వరకు 89 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఒక్కో రైతు నుండి గరిష్టంగా 40 క్వింటాళ్లు చొప్పున కొనుగోలు చేస్తారని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులు, దళారీలకు పంట ఉత్పత్తులు విక్రయించి మోసపోకుండా రైతులు జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.
