అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం.
• జనసేన నేతలతో భారీ బైక్ ర్యాలీ
• సభ్యత్వం కార్యకర్తలకు రక్షణ కవచం
• గ్రామీణ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి పిలుపు
రాయదుర్గం పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని గోస బావి వీధి సమీపంలోని గణపతి కళ్యాణమండపంలో కురుబ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కరేగౌడ మంజునాథ్ గౌడ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, అనంతపురం జిల్లా ఇంచార్జ్ & అహుడా చైర్మన్ టి.సి. వరుణ్, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ గౌడ పాల్గొన్నారు.
ముందుగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి లక్ష్మీ బజార్, వినాయక కూడలి మీదుగా వినాయక కళ్యాణ మండపం వరకు జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇతర పార్టీల నుండి నలుగురు జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చేయడం కార్యకర్తల బాధ్యత అని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కుటుంబానికి రక్షణ కవచం లాంటిదని కొనియాడారు. పదవుల కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే స్ఫూర్తితో సభ్యత్వాన్ని ఐదింతలు పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కార్యకర్తలు ఐక్యతతో పనిచేసి రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు.
టి.సి. వరుణ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తల కుటుంబాలకు భరోసా లభిస్తుందని, ప్రమాద బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.
మంజునాథ్ గౌడ మాట్లాడుతూ గతంలో చేసిన సభ్యత్వ నమోదు ద్వారా రాయదుర్గంలో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిందని తెలిపారు. అందువల్ల ప్రతి కార్యకర్త తప్పనిసరిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు.
