Latest Posts

మహిళా హక్కుల రక్షణలో ప్రభుత్వాలు విఫలం: అఖిల భారత మహిళా సమాఖ్య ధ్వజం

అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం.

*అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో మహిళా హక్కులపై గళమెత్తిన అఖిల భారత మహిళా సమాఖ్య*

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాయదుర్గం పట్టణంలో స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల భారత మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

*ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్య జెండాను ఆవిష్కరించన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి గారు* నినాదాల మధ్య సంబరాలు జరిపారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి అనంతపురం జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్ గార్లు మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచినా మహిళలకు ఇప్పటికీ సంపూర్ణ భద్రత, సమాన హక్కులు లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గృహహింస, పని ప్రదేశాల్లో అవమానాలు పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

మహిళలు సమాజంలో సగం భాగస్వాములు అయినప్పటికీ నిర్ణయాత్మక స్థానాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై ప్రభుత్వాలు మాటలకే పరిమితమవుతున్నాయని, అమలులో మాత్రం మహిళలకు న్యాయం జరగడం లేదని అన్నారు.మహిళల భద్రత కోసం కఠిన చట్టాలు ఉన్నా, అవి సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల నేరస్తులకు భయం లేకుండా పోయిందని తెలిపారు.

అలాగే మహిళలకు సమాన వేతనం, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి మౌలిక హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగే ప్రతి అణచివేతకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మహిళా హక్కులపై అవగాహన కల్పిస్తూ, మహిళలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సమాజమంతా స్పందించి, మహిళలకు భద్రత కలిగిన వాతావరణాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాయదుర్గం నియోజవర్గ అధ్యక్షురాలు హసీనా నియోజవర్గ కోశాధికారి అయేషా నియోజవర్గ నాయకులు అనూష రూప మంజుల వసంతకోమల లక్ష్మి నాగవేణి తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor