- 850 గ్రాములు బంగారు..
- 670 గ్రాములు వెండి..
- రూ. 7.70 లక్షలు నగదు అపహరణ
- మైదుకూరు రోడ్డులోని లక్ష్మీనగర్ లో ఘటన
ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్ లో ఉన్న లక్ష్మీనగర్ లో నివాసముంటున్న వల్లం కొండు రఘువంశి ఇంట్లో భారీ చోరీ జరిగింది.
రఘువంశి వస్త్ర భారతిలో బట్టల షాపు నిర్వహిస్తున్నాడు
ఆయన తల్లి కన్యాకుమారికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారం రోజులు క్రితం ఆమె బెంగళూరులో ఉంటున్న పెద్ద కుమారుడు రవిచంద్ర వద్దకు వెళ్లారు
ఈ క్రమంలో తల్లిని చూసేందుకు రఘువంశి తో పాటు కుటుంబ సభ్యులందరూ శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లారు
శుక్రవారం వారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో చోరీ జరిగిన విషయం శనివారం ఉదయం తెలియడంతో రఘువంశి కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రొద్దుటూరుకి వచ్చారు
ఇంట్లో పరిశీలించగా సుమారు 850 గ్రాములు బంగారం, 670 గ్రాముల వెండి, రూ.7.70 లక్షలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ప్రొద్దుటూరు డిఎస్పి భావన, రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్సై మహమ్మద్ రఫీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు
రఘువంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు