సత్యసాయి జిల్లా కదిరి పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ బాబు..

సత్యసాయి జిల్లా కదిరి పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ బాబు గారికి ముదిగుబ్బ మండలం గరుగుతండా బైపాస్ వద్ద ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ భూ దందా, భూ అరాచకాలపై ఆధారాలతో సహా మంత్రికి ఫిర్యాదు చేసిన అడవి బ్రాహ్మణపల్లి తండాకు చెందిన బాధిత గిరిజన మహిళలు,గిరిజన రైతులు. గిరిజన సంఘాల నాయకులు.

 

ఈ విషయంపై తనకు ఫిర్యాదులు వచ్చాయని,వాటిపై తప్పకుండా జిల్లా అధికారులకు తో విచారణ చేయించి అందుకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ గిరిజన మహిళలకు, భాధిత రైతులకు హామీ ఇచ్చారు. బాధిత గిరిజన రైతులు ఇచ్చిన ఫిర్యాదును మంత్రి నారా లోకేష్ బాబు తీసుకొని తన వ్యక్తిగత కార్యదర్శికి అందజేశారు.

Posted Under AP
Editor