టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇంకా తేడాదికి వచ్చినా రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో నాని స్పీడును పెంచాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా లైన్ లో పెట్టాడు. దసరా తర్వాత రెండో సినిమా కూడా శ్రీకాంత్ కి ఛాన్స్ ఇచ్చాడు నాని.. ఆ సినిమాను నాని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఒక అప్డేట్ కూడా రాలేదు. దాంతో నాని ఫ్యాన్సు టెన్షన్ పడుతున్నారు. పారడైస్ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
గతంలో వచ్చిన నాని దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ముందు నాని నాచురల్ హీరోగా రొమాంటిక్ బాయ్ లాగా కనిపించాడు. ఈ సినిమాలో మాత్రం మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు. తొలి సినిమా అయినా సరే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ వేరే లెవెల్ అనిపించేశాడు.. డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్.. నాని అదే డైరెక్టర్ కు రెండో ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాకు పారడైస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ అఫీషియల్ రిలీజ్ చేయకముందే లీక్ అయ్యింది. శ్రీకాంత్ ఓదెల నాని మరోసారి తమ మార్క్ సినిమాతో రాబోతున్నారు.. అటు నాని కూడా ఈ సినిమా విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు. మొత్తానికి ఈ సినిమాతో మరో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తుంది..
ఈ సినిమా అయితే అనౌన్స్ చేశారు కానీ సినిమా షూటింగ్ అప్డేట్ ఇవ్వలేదు. మరి సినిమా ఆగిపోయిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని చేస్తున్న హిట్ 3 పూర్తవ్వడం ఆలస్యం పారడైస్ పనుల్లో ఉంటాడని తెలుస్తుంది. నాని ఈసారి పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ ఈ సినిమాతో కూడా అనుకున్న విధంగా అదరగొడితే మాత్రం రెండు సినిమాలకే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోవడం పక్కా అని సినీ ప్రముఖులు అంటున్నారు.. నిజానికి నాని సినిమాల ప్లానింగ్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ప్రతి సినిమా దాని కథ కథనాలే కాదు రిలీజ్ ప్లేస్ మెంట్ లు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్నాడు. అందుకే నాని ఇప్పుడు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు.. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న నాని ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ లో రానున్న సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత నాని ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి..