తిరుమలలో కారేరిష్ఠి యాగం.. మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీటీడీ..

తిరుమలలో నేటి నుంచి 26 తేదీ వరకు కారేరిఇష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

కారేరిష్ఠి యాగాన్నితిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో రుత్వికులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ యాగాన్ని మొదటగా గణపతి పూజతో ప్రారంభిస్తారు. ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ అవధాని చూసుకుంటున్నారు.

కారేరిష్ఠి యాగాన్ని 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు, రుత్వికులు ఐదు రోజులపాటు ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది. కారేరిష్ఠి గాన్ని నల్ల వస్త్రాలు ధరించి నిర్వహిస్తారు. మేఘాలను ప్రసన్నం చేసుకోవడానికి నల్లని వస్త్రాలు ధరిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ యాగం వల్ల దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరిస్తున్నారు. యాగంలో బియ్యం, తేనే ఉపయోగిస్తారు.

ఈ యాగాన్ని ప్రారంభించే ముందు ఓ గుర్రాన్ని, గొర్రెను యజ్ఞగుండం అభిముఖంగా తీసుకొస్తారు. అవి తలలూపిన తరువాత యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. కారీరిష్టి యజ్ఞనంలో భాగంగా వరుణ జపం కూడా చేస్తారు. వరుణ మంత్రాన్ని పాఠించి.. వరుణ దేవుడిని ప్రర్థిస్తారు. 26న శాంతి హోమం, మహాపూర్ణాహుతితో యాగం ముగుస్తుందని టీటీడీ తెలిపింది. గతంలో కూడా టీటీడీ కారేరిష్టి యజ్ఞం చేసింది. 2017 ఈ యాగాన్ని నిర్వహించారు. 6 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు నిర్వహించనున్నారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగస్టు 26న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు.

ఈ యాగాలు పూర్తయ్యాక సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వాటిని అనుసరిస్తూ అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ తెలిపింది. ఇక నవంబర్ నెలలో జరగనున్న కార్యక్రమాలకు మంగళవారం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఉ.10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా, సహస్ర దీపాలంకరణ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లో విడుదల చేయనున్నారు.

YES9 TV