ఆగస్టు 21న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ దాని ఇంజిన్‌లు సరిగ్గా షట్ డౌన్ చేయడంలో విఫలమవడంతో చంద్రుడిపై కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ స్పందించారు.
ఈ దుర్ఘటనకు దేశం దశాబ్దాలపాటు చంద్రుని అన్వేషణలో విరామమే కారణమని ఆరోపించారు. సుదీర్ఘకాలం పాటు ప్రయోగాలకు విరామం రావడంతో ఇలా జరిగిందన్నారు. పైలట్ లేని లూనా-25 ఆగష్టు 21న ల్యాండ్ కావాల్సి ఉంది.
అదే సమయంలో చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన మొదటి అంతరిక్ష నౌకగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీరు, విలువైన మూలకాల ముఖ్యమైన నిల్వలు ఉన్నాయని రష్యా శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. “లూనా-25ని ప్రీ-ల్యాండింగ్ ఆర్బిట్”లో చేర్చడానికి వారాంతంలో అంతరిక్ష నౌక ఇంజిన్‌లు ఆన్ చేశారు. అయితే సరిగ్గా షట్ డౌన్ కాలేదని, ల్యాండర్‌ను చంద్రునిపై కూలిపోయిందని యూరీ బోరిసోవ్ చెప్పారు.
“ప్రణాళిక 84 సెకన్లకు బదులుగా, ఇది 127 సెకన్ల పాటు పనిచేసింది. ఇది ఎమర్జెన్సీకి ప్రధాన కారణం”అని బోరిసోవ్ చెప్పారు. రోస్కోస్మోస్ వ్యోమనౌకతో మధ్యాహ్నం 2:57 వరకు అనుసంధానంలోనే ఉందన్నారు. స్థానిక సమయం శనివారం కమ్యూనికేషన్ కోల్పోయినప్పుడు “పరికరం బహిరంగ చంద్ర కక్ష్యలోకి వెళ్లి చంద్రుని ఉపరితలంపైకి క్రాష్” అని వివరించాడు. సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు 1976 రష్యా చంద్రుడిపై వ్యోమనౌకను పంపింది. ఆ తర్వాత
మొన్న లూనా-25 ప్రయోగించింది.
మూడు దేశాలు మాత్రమే విజయవంతమైన చంద్రుని ల్యాండింగ్‌లను నిర్వహించాయి. అందులో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, చైనా ఉన్నాయి.
“దాదాపు 50 సంవత్సరాలు చంద్రుని కార్యక్రమానికి అంతరాయం కలిగించిన ప్రతికూల అనుభవం వైఫల్యాలకు ప్రధాన కారణం” అని బోరిసోవ్ అన్నారు.
లూనా-25 జులై 14న ప్రయోగించిన భారత అంతరిక్ష నౌకతో తొలిసారిగా దక్షిణ ధ్రువాన్ని చేరుకునే రేసులో ఉంది. రెండు దేశాలు ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23 మధ్య చంద్రుడిని చేరుకుంటారని అంచనా వేశారు. కానీ లూనా-25 ల్యాండర్ కూలిపోయింది.
ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా చంద్రయాన్-3 పైనే ఉంది. 2019లో చంద్రుని దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ చేయడానికి భారతదేశం చేసిన చంద్రయాన్-2 అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలంపై కూలిపోయింది.
