సన్నీలియోన్‌ పేరిట నెలకు రూ.1000 ఆర్థిక సాయం.. షాక్ అయ్యారా..?

ఈ నటి తెలియని వారే ఉండరు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ లే కాకుండా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. కానీ పాపం ప్రతి నెల ఆమె ఖాతాలో ప్రభుత్వం రూ. 1000 లు జమచేస్తోంది. అంత పేరు ప్రఖ్యాతులు గల నటికి ఏమంత కష్టమొచ్చిందని, మీరు మాత్రం కన్నీరు కార్చవద్దు. అసలు సంగతి తెలిస్తే అవాక్కవుతారు. అసలేం జరిగిందంటే?

 

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ లో ఓ వ్యక్తి ఏకంగా సన్నీలియోన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశాడు. అకౌంట్ ఓపెన్ చేసి అంతవరకు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన యోజన పథకం కు దరఖాస్తు కూడా ఆమె పేరు మీదనే చేశాడు. ఇటీవల ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని విమర్శలు వినిపించాయి. దీనితో సంబంధిత అధికారులు రంగంలోకి దిగి, అర్హులు ఎంతమంది ఉన్నారు? అనర్హులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చే పనిలో పడ్డారు.

 

అప్పుడు తెలిసింది ఇన్ని రోజులుగా తమ సన్నిలియోన్ ఖాతాలో నగదు జమ చేస్తున్నామని అధికారులకు. ఇక అంతే వారంతా షాక్. దీనికి కారకుడు ఎవరని అధికారులు విచారించి చిట్ట చివరకు వీరేంద్ర జోషి అనే వ్యక్తి ఈ తతంగానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. సన్నీలియోన్ పేరు మీద తీసిన అకౌంట్ లో ఆమె భర్తగా ఇంటర్నేషనల్ మేల్ స్టార్ జానీ ప్రిన్స్ పేరు నమోదై ఉండడం విశేషం.

 

ఎక్కడైనా అవినీతికి పాల్పడడం చూశాం గానీ, ఏకంగా బాలీవుడ్ నటి పేరుతో ప్రభుత్వం అందించే సాయాన్ని పొందాలని ఆలోచన వచ్చిన వీరేంద్ర జోషిని చూసి.. ఏమి బాబు ఇది? పద్దతేనా? చేసే మోసానికి కూడా కాస్త అర్థం ఉండాలంటూ స్థానికులు ఛలోక్తులు విసురుతున్నారట. మొత్తం మీద మనవాడి ఘనకార్యం బయటపడడంతో అధికారులు, ఇన్ని రోజులుగా జమ చేసిన నగదును రికవరీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Editor