సీబీఐ అంటే మన దేశంలో ఎంతో నమ్మకం ఉన్న సంస్థ. ఒక కేసును సీబీఐ టేకప్ చేసిందంటే కచ్చితంగా నిజానిజాలు బయట పెడుతుందనే నమ్మకం ఒకప్పుడు ఉండేది.
కానీ ఇప్పుడు వివేకా హత్య కేసును ఆ సంస్థ దర్యాప్తు చేస్తున్న తీరు చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఒక్క ఆధారాన్ని పట్టుకుని.. అదే సాక్ష్యం.. అందులో ఉన్న వారే నిందితులు అనేట్టు సీబీఐ ఆరోపణలు ఉంటున్నాయి.
కానీ కేసును ఎన్ని కోణాల్లో విచారించాలో అన్ని కోణాల్లో అస్సలు విచారించట్లేదు. విచారణకు ముందుగానే అవినాశ్ రెడ్డిని నిందితుడిగా గుర్తించి ఆయన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నేళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ.. అవినాశ్ రెడ్డిని దోషిగా నిరూపించే ఒక్క సాక్ష్యం కూడా బయట పెట్టలేదంటే.. ఆ సంస్థ ఏ రేంజ్ లో దర్యాప్తు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సీబీఐ పనితీరును విమర్శిస్తూ ది వైర్ అనే ఆంగ్ల్ వెబ్ సైట్ పూర్తి వివరాలను బయట పెట్టేసింది. ఆ కథనంలో ఇలా రాసుకొచ్చింది. అసలు సీబీఐ ఒకే ఒక్క కోణంలో ఆలోచిస్తోంది తప్ప.. వివేకా హత్య కేసుకు ఇంకేమైనా కారణాలు ఉండొచ్చనే ప్రతిపాదనకు ఎందుకు రావట్లేదు. ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు.
కడప ఎంపీ సీటుకు అవినాష్, వివేకానందరెడ్డి మధ్య పోటీ ఉందని.. అదే ఆయన హత్యకు కారణం అని ఆరోపిస్తోంది. కానీ వాస్తవంగా ఆయన హత్యకంటే ముందే ఎంపీ సీటును అవినాష్ రెడ్డికి జగన్ ఖరారు చేశారు. పైగా అవినాష్ రెడ్డికి సపోర్టుగా వివేకా ప్రచారం కూడా చేశారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఎంపీ సీటు వివాదం అనేది ఎక్కడిది.
ఇక వైఎస్ షర్మిల చేసిన స్టేట్ మెంట్ ను
సీబీఐ
బలంగా పట్టుకుంది. ఎంపీ సీటుకు అవినాష్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదంటూ షర్మిల చేసిన కామెంట్లను ఆధారంగా తీసుకుంటోంది. ఒకవేళ బలమైన అభ్యర్థి కాకపోతే.. 2014లో 1.90 లక్షల ఓట్ల మెజారిటీ, 2019లో 3.80 లక్షల ఓట్ల మెజారిటీతో ఎలా గెలుస్తారు. ఈ విషయాన్ని సీబీఐ ఎలా మరిచిపోయింది.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి కారణం అవినాష్ రెడ్డి అంటూ మరో ఆరోపణను ముందుకు తోస్తోంది. కానీ దీనికి కూడా ఆధారాల్లేవు. ఇంకో వైపు చూస్తే.. వివేకా షమీమ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇది ఆయన కూతురు సునీతకు, భార్య సౌభాగ్యమ్మకు ఇష్టంలేదు. అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారు.
సౌభాగ్యమ్మ సోదరులు తనను బెదిరించినట్లు షమీమ్ వెళ్లి సీబీఐ వద్ద వాంగ్మూలం కూడా ఇచ్చింది. మరీ ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ జరపట్లేదు. వివేకా హత్యకు ఆర్థిక లావాదేవీలు కూడా కారణం అయి ఉండొచ్చు కదా. మరి దాన్ని సీబీఐ ఎందుకు టచ్ చేయట్లేదు. ఆ విషయాలను అన్నీ పక్కన పెట్టేసి కేవలం
అవినాష్
దోషిగా నిలపాలనే ఆరాటమే సీబీఐలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇన్ని రకాల ఆధారాలను వదిలేసి.. కేవలం నిరాధార ఆరోపణలతో సీబీఐ ముందుకు వెల్తోంది. ఇలా సీబీఐ తన విధానాలకు విరుద్ధంగా వెళ్తోందని వైర్ తన కథనంలో విశ్లేషించింది.