మన పురాణాల ప్రకారం ప్రతి యుగంలో కూడా అధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మస్థాపన చేస్తాడు.
ఇప్పటి వరకు ఆయన 9 అవతారాలు ఎత్తాడు. చివరది శ్రీకృష్ణుడి అవతారం. ఇప్పుడు కలియుగం నడుస్తోంది. అయితే ఈ కలియుగంలో మానవుల విపరీత బుద్ధి వల్ల అధర్మం ఏర్పడుతుంది.
గోవులను వధించడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వావి వరసలు మరిచి సంబంధాలు పెట్టుకోవడం, చిన్న పిల్లలపై ఆకృత్యాలు ఇలా అరాచకాలు విపరీతంగా పెరిగిపోయి.. మనుషుల ఆయుషు కేవలం 18 ఏళ్లకే పడిపోతుంది. పురుషులు అందరూ కేవలం 18 ఏళ్లకే చనిపోతూ ఉంటారు.
వ్యాధులతో చనిపోతారు..
ఇలా పురుషుల ఆయుష్షు క్షీణించినప్పుడు “శంభాలా ” అనే గ్రామంలో విష్ణుయేశుడు అనే బ్రాహ్మణుని కడుపున కల్కి అవతారంతో మహావిష్ణువు పదవ అవతారంగా జన్మిస్తాడు. ఆయన జన్మించిన తర్వాత పాపులు అందరూ ఆసనము వద్ద వ్యాధులు వచ్చి రక్తం కారుతూ పురుగుల వలె చనిపోతూ ఉంటారు.
పాపాలు చేసిన వారంతా రోగాలతో క్షణాల్లోనే చచ్చిపోతారు. ఇలా వారంతా చనిపోయిన తర్వాత మిగిలిన అసమర్ధ పాలకులను కల్కి గుర్రంపై వెళ్లి చంపేస్తాడు. దాంతో మిగతా వారంతా ఆ యుద్ధంలోనే చనిపోతారు. ఇలా కలియుగం అంతం అవుతుంది. కృతియుగం మొదలు కావడానికి ముందు నీటితో భూమండలాన్ని ముంచేస్తుంది ప్రకృతి.
