అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లి లో అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొని మూడు పల్టీలు కొట్టిన కారు, కారులో ప్రయాణిస్తున్న తల్లి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. పుట్టపర్తి నుండి మొలకల చెరువుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డు దగ్గర ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.
నల్లమాడలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: తల్లి, కొడుకు క్షేమం!
