Latest Posts

బొమ్మనహాల్ మండల అభివృద్ధే లక్ష్యం.. బీరువా గుర్తుకు ఓటేయండి…

*బొమ్మనహాల్ మండల అభివృద్ధే లక్ష్యం.. బీరువా గుర్తుకు ఓటేయండి

*మండలవ్యాప్తంగా స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి మహీంద్ర విస్తృత ప్రచారం

బొమ్మనహాల్, అక్టోబరు YES 9 TV News

మండల పరిధిలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి కొత్తపల్లి మహీంద్ర మండలవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. తనకు మద్దతు తెలిపి బీరువా గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు.ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న మహీంద్ర ప్రజలతో మమేకమవుతూ తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ప్రజలు తనకు అండగా నిలిస్తే బొమ్మనహాల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మహీంద్ర తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, గ్రామాల ప్రగతికి ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో తనను ఆదరించి బీరువా గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. మహీంద్ర చేపడుతున్న ప్రచారంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.

Posted Under AP
Editor