“సర్” ప్రజల పై గుర్రు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామం సర్ కార్యక్రమంలో ఓటర్ లిస్ట్ తీసుకొని ఇంటింటికి వెళ్లి సర్వే చేయమని ప్రభుత్వం చెపితే రచ్చ బండ దగ్గరకి ప్రజలని రమ్మని దండోరా వేపించి సర్వే చేయడంతో గోపేపల్లి గ్రామానికి చెందిన దేవాలనాయక్, BLO ని మీరు ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని రాయాలి కదా మరి ఎక్కడ ఎందుకు ఎలా చేస్తున్నారు అని అడగగా నేను ఇక్కడే చేస్తాను గ్రామం మొత్తము ఇక్కడే చేస్తాను ఇంటింటికి వెళ్లి చేయాలా, నాకు ఇలాగే పర్మిషన్ ఇచ్చారు. ఏమి చేస్తావో చేసుకో అని దురుసుగా సమాధానం చెప్పడం జరిగింది. ప్రజలకి అవగాహన కల్పించవలసిన అధికారులు ఇలా దురుసుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని దేవాలనాయక్ తెలిపారు.
నల్లమాడ: ‘ఇంటింటి సర్వే’ గాలికొదిలేసి… ప్రశ్నించిన జనంపై బీఎల్‌ఓ దురుసు ప్రవర్తన!
