నల్లమడలోఘనంగా ఫాదర్ ఫెర్రర్ గారికి 17వ వర్ధంతి వేడుకలు
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రమైన బీసీ హాస్టల్ దగ్గర గల ఫాదర్ గారి 17వ వర్ధంతి శుభ సందర్భాన ఫాదర్ ఫెర్రర్ గారి విగ్రహానికి నల్లమాడ ఆర్ డి టి ఎయిర్టెల్ ఎస్ వన్నూరు స్వామి, బుట్టి నాగభూషణం నాయుడు, నల్లమాడ ప్రజలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
నల్లమాడ ఆర్డిటి ఎయిర్టెల్ ఎస్ వన్నూర స్వామి, బుట్టి నాగభూషణం నాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి అనంతపురం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఫాదర్ ఫెర్రర్ గారి 17వ వర్ధంతి శుభ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు వారు చేసిన సేవలను కొనియాడుతూ ఫాదర్ ఫెర్రర్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలలో నడిచి తన వంతు సాయంగా ఉన్న వాటిలో పేదవారికి సహాయం చేయాలని సంకల్పం కలిగి ఉండాలని, ఫాదర్ ఫెడరల్ గారు 1969 లో అనంతపురంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉమ్మడి అనంతపురంలోని గ్రామీణ నిరు పేదలకు నివాస గృహాలు, విద్య వైద్యం వివిధ రకాల మౌలిక సదుపాయాలు సమకూర్చి వారి ఉన్నతికి ఎనలేని సేవలు అందించారు వారి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిటి సభ్యులు నల్లమాడ ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
