ప్రజల కష్టసుఖాల్లో నిత్యం తోడుండే కూటమి అభ్యర్థిని గెలిపించండి
– గుంతకల్ మండల ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి
గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన అభ్యర్థి బోయ పద్మావతి (లాయర్ ప్రతాప్ కుమార్తె) గారి విజయాన్ని కాంక్షిస్తూ గుంతకల్ మండల ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి గారు మిల్లి ఏరియా ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి గారు మాట్లాడుతూ.. మిల్లి ఏరియా ప్రజలు ప్రధానంగా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు, గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇంటి పట్టాల కేటాయింపు వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే లాయర్ ప్రతాప్ గారి కుటుంబానికి చెందిన బోయ పద్మావతి గారిని గెలిపించాలని కోరారు. గతంలో ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న నాయకులు లేరని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు, పైప్లైన్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, మున్ముందు కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు చెప్పే మాయమాటలను నమ్మకుండా అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్థానిక ప్రజల స్పందన:
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి అనుచరులు పెన్షన్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారని ఆరోపించారు. ఆధిపత్య ధోరణి, రౌడీయిజం, గొడవలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే లాయర్ ప్రతాప్ గారు తమ కష్టకాలంలో అండగా నిలుస్తూ, ప్రభుత్వ పరంగా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో సహకరించారని, పేద కుటుంబాల శుభకార్యాలు, ఇతర అవసరాల సమయంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు.
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నాయకత్వాన్ని గుర్తించి ఈసారి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి బోయ పద్మావతి గారిని గెలిపిస్తామని స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
