ఢిల్లీ వెళ్లకుండా ధైర్యంగా ఉండిపోయిన డీకే

ఎవరో ఏదో మాట్లాడారని తాను దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన వర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పనవసరం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 135 మంది ఎమ్మెల్యేలు నావాళ్లే అని, గత ఐదు ఏళ్లలో ఏం జరిగింది అని ఇప్పుడు తాను చెప్పాల్సిన అవసరం లేదని.

భవిష్యత్తులో ఆ విషయాల గురించి మాట్లాడుతానని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం మద్యాహ్నం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. హెచ్ఏఎల్ నుంచి ప్రత్యేక విమానంలో సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ రోజు మే 15వ తేదీ డీకే శివకుమార్ బర్త్ డే. పుట్టిన రోజు సందర్బంగా బెంగళూరులోని సదాశివనగర్ లోని డీకే శివకుమార్ కుటుంబ సభ్యులు ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించారు.

ఇంట్లో పూజలు చేసిన తరువాత ఉదయం నుంచి డీకే శివకుమార్ వివిద దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. పుట్టిన రోజు సందర్బంగా కనకపుర వెళ్లిన డీకే శివకుమార్ స్నేహితులు, సన్నిహితులు ఏర్పాటు చేసిన బర్త్ డే ఫంక్షన్ లో పాల్గొన్నారు. తరువాత బెంగళూరులోని సదాశివనగరకు చేరుకున్న డీకే శివకుమార్ అక్కడ మీడియాతో మాట్లాడారు.

మీరు ఎందుకు ఇంకా ఢిల్లీ వెళ్లలేదని మీడియా ప్రశ్నించడంతో డీకే శివకుమార్ ఇలా సమాధానం ఇచ్చారు. 2019లో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి పిలుచుకుని రావడానికి తాను ఒక్కడే పోరాటం చేశానని, ముంబాయి వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి నేను ఒక్కడే ప్రయత్నించానని డీకే శివకుమార్ గుర్తు చేశారు.

YES9 TV