దేశ చరిత్రలో నిరుద్యోగులను మోసం చేసిన అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలప్‌మెంట్ అని సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారని జగన్ ఆరోపించారు. ఈ స్కిల్ ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. సీమెన్స్ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ జరిగిందని జగన్ అన్నారు. సీమెన్స్ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నడిపారని సీఎం జగన్ అన్నారు. ఈ కుంభకోణంలో 371 కోట్ల రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా రకరకాల మార్గాల్లో రూటింగ్ చేసి మళ్లీ ఆ డబ్బు మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చారని వివరించారు. ఇది ఒక నిపుణుడైన నేరగాడు చేసిన నేరం ఇదని జగన్ అన్నారు.
కేబినెట్‌లో చర్చించి జారీ చేసిన GOకు విరుద్ధంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ సాగిందని జగన్ విమర్శించారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచేసిన తీరుకు సరైన ఉదాహరణ ఈ స్కామ్ అని అన్నారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బు తిరిగి హైదరాబాద్‌లోని చంద్రబాబు దగ్గరకు చేరిందని తెలిపారు. అన్ని దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని జగన్ వివరించారు.స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో విచారణ అంటూ జరిగితే ఎలా తప్పించుకోవాలో ముందుగానే చంద్రబాబు ఊహించారని సీఎం జగన్ అన్నారు. అసలు కేసు విచారణే జరపకుండా చంద్రబాబు ఎంతో గొప్ప విజన్‌తో వ్యవహరించారని జగన్ విమర్శించారు. చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కామ్ ఊపిరిపోసుకుందని జగన్ వివరించారు.
