నక్కపల్లి హైవేపై వోల్వో బస్సు బోల్తా ….6 మందికి తీవ్రగాయాలు

విశాఖ :

 

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై ప్రయివేటు వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. భువనే శ్వర్ నుంచి చెన్నైకు సుమారు 38 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైనట్లు సమా చారం. గాయపడిన వారిని వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికు లు చెబుతున్నారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పెద్ద ప్రమా దం తృటిలో తప్పినట్లు అధికారులు చెబుతున్నారు.

Posted Under AP
Editor