అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••
జగన్ పాలనలో విధ్వంసం
జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీ.సీ. జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గం మండలం పల్లె పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రగతి పండుగ వేడుకల్లో ఆయన తోపాటు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తాడిపత్రి శాసనసభ్యులు అస్మిత్ రెడ్డి లు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు సమావేశానికి అధ్యక్షత వహించగా. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు.ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రంగును మార్చి తన నిజస్వరూపాన్ని నిరూపించుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా వేదిక తో మొదలైన విధ్వంసం కక్ష సాధింపులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.టిడిపి నేతలను అడుగడుగునా అణుగుదొక్కుతూ అక్రమ కేసులతో వేధించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గొడ్డలి పార్టీ నాయకుడు పారిశ్రామికవేత్తలకు భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని ధ్వజ మెత్తారు.
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించిన వారిపై తాను అధికారంలో వచ్చాక వారిని జైల్లో పెడతానని హెచ్చరించడం దుర్మార్గమన్నారు.
వై నాట్ 175 నుంచి 11 స్థానాలకు
పరిమితమైన జగన్ దురహంకారం తగ్గలేదన్నారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో 17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభ పరిణామమాన్నారు.
త్వరలో అమరావతి పనులు పూర్తి అవుతాయన్నారు.
పోలవరం పనులు పరుగులు పెడుతున్నట్లు తెలిపారు.
బైట్స్.1. బీ.సీ. జనార్దన్ రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి
