ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం బూదనాంపల్లి గ్రామంలో మంత్రి సత్యకుమార్ చొరవ, కృషితో వందలాది ఎకరాలకు అందనున్న సాగునీరు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం బూదలమ్మ చెరువు నుండి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనులకు శ్రీకారం బూదలమ్మ చెరువు నుండి చింతకుంట చెరువుకు రూ.25 లక్షలతో ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనులకు శ్రీకారం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది – ఆ దిశగా అడుగులు వేస్తున్నాం – మంత్రి సత్య కుమార్ యాదవ్ సంకల్పమే సాధనం – మాటలకే కాదు, పనులకే ప్రాధాన్యం – మంత్రి సత్య కుమార్ యాదవ్…కొండలు అడ్డుకాలేవు –ప్రతి చుక్క నీరు రైతుకే – మంత్రి సత్య కుమార్ యాదవ్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి హతో రైతన్నల దశాబ్దాల కల నెరవేరనుంది. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలోని బూదలమ్మ చెరువు నుండి చింతకుంట చెరువుకు ఆదివారం నిర్వహించిన వీబీజీ – రామ్‌జీ (VBG–RamG) మరియు జలధార (తాగునీరు & భూగర్భ జలాల పెంపుదల) ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనుల కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు బుదలమ్మ చెరువు (బుదనంపల్లి) నుండి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా చెరువు పరిసర ప్రాంతాల్లోని బోర్లలో నీటిమట్టం కూడా పెరిగి రైతులకు లబ్ది చేకూరనుంది. యోగి వేమన రిజర్వాయర్ ద్వారా బుదనంపల్లి చెరువుకు వచ్చే జలాలను ఈ ఫీడర్ ఛానల్ ద్వారా చింతకుంట చెరువుకు మళ్లించడం ద్వారా ప్రాంతంలోని నీటి కొరతను తగ్గించడమే లక్ష్యమని తెలిపారు.
బుదలమ్మ చెరువు ప్రాముఖ్యత & ప్రస్తుత పరిస్థితి:
శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం బుదనంపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న బుదలమ్మ చెరువు రెండు కొండల మధ్య లోతైన ప్రాంతంలో నిర్మించబడింది. సుమారు 80 మీటర్ల పొడవు గల మట్టి కట్టతో నిర్మించబడిన ఈ చెరువుకు 14.39 Mcft నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, 15 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో తూము ద్వారా నీటిని విడుదల చేసి తడి పంటలు సాగు చేసేవారు. చెరువుకు ఉన్న ఎడమ, కుడి ఫీల్డ్ ఛానెల్స్ ద్వారా ఆయకట్టు భూములకు నీరు చేరేది. అదనంగా, మిగిలిన నీరు చింతకుంట చెరువుకు చేరి అక్కడి సాగునీటి అవసరాలను కూడా తీర్చేది. అయితే, భూగర్భ జలాల పెంపుదల మరియు మెట్టిపంటల అభివృద్ధి దృష్ట్యా గతంలో తూమును పూర్తిగా మూసివేయడంతో ప్రస్తుతం ఆయకట్టు సాగు తగ్గిపోయింది. ప్రస్తుతం చెరువులో సుమారు 50% నీటి నిల్వ మాత్రమే ఉన్నప్పటికీ, ఫీల్డ్ ఛానెల్స్ వినియోగంలో లేవు.బుదలమ్మ చెరువు చుట్టూ ఉన్న ఎత్తైన కొండల కారణంగా చింతకుంట చెరువుకు నేరుగా ఫీడర్ ఛానల్ నిర్మాణం సాంకేతికంగా క్లిష్టంగా ఉండటం తూము మూసివేయడంతో రైతులు సాగుకు ఆసక్తి చూపకపోవడం
కొత్త ఫీడర్ ఛానల్ నిర్మాణానికి భూసేకరణ అవసరం ఉండటం
ఫీడర్ ఛానల్ నిర్మాణంతో లాభాలు:–
మంత్రి గారు మాట్లాడుతూ, ఈ లింక్ ఛానల్ పనుల ద్వారా పలు ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు:
సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది
భూగర్భ జలాలు పెరిగి బోర్‌వెల్‌లు రీచార్జ్ అవుతాయి
పశువులకు తాగునీటి సదుపాయం మెరుగుపడుతుంది
తక్కువ వర్షపాతం ప్రాంతమైన ముదిగుబ్బ మండలంలో స్థిరమైన వ్యవసాయానికి బలం చేకూరుతుంది
వీబీజీ – రామ్‌జీ పథకం ద్వారా గ్రామీణులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
ఈ పనులను సుమారు ₹25 లక్షల వ్యయంతో చేపడుతున్నామని, వీర్ నిర్మాణం, రాళ్ల తొలగింపు వంటి కీలక పనులు ఇందులో భాగమని మంత్రి వివరించారు. ఫీడర్ ఛానల్ నిర్మాణం కోసం తమ భూములను స్వచ్ఛందంగా అందించిన రైతుల సహకారం అభినందనీయము…ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి, ఏపీడి చలపతి, ఎమ్మార్వో మహేశ్వరరెడ్డి, ఎంపీడీవో శకుంతల, వీబీజీ – రామ్‌జీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
