Latest Posts

జగన్ హయాంలో రాక్షస పాలన…

అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం
___________________________

జగన్ హయాంలో రాక్షస పాలన

జగన్ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని రాష్ట్ర విద్యా వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రగతి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబుకు ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వారికి ఘన స్వాగతం పలికారు.
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హిందూ సమ్మేళన సమితి, వినాయక సర్కిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. రెండు లక్షలతో ఏర్పాటుచేసిన తాగునీటి శుద్ధి జల కేంద్రాన్ని మంత్రి వై. సత్య కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలి నేని సురేంద్రబాబు లు ప్రారంభించారు.
ప్రగతి పండుగ వేడుకల్లో భాగంగా గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అర్ధాంతరంగా ఆగి ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల ఆదర్శ పాఠశాల పునర్ నిర్మాణం పనులను రూ.12 కోట్లతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి తన వికృత రాక్షసక్రీడతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో 8500 పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

జగన్ రప్ప రప్ప మాటలకు భయపడేవారు ఎవరు లేరని
ఆయన ప్రవర్తన మారకపోతే వైసీపీ పార్టీని ప్రజలుసజీవ భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

బైట్స్. సత్య కుమార్ యాదవ్,. రాష్ట్ర విద్యా వైద్య శాఖ మంత్రి

Posted Under AP
Editor