విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్ టెస్ట్‌లొ కెరీర్‌లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజున విరాట్ ఈ ఘనత సాధించాడు. కోహ్లీకి ఇది 28వ టెస్టు సెంచరీ కాగా, గత 40 నెలలుగా టెస్టులో సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, కోహ్లి తన చివరి టెస్టు సెంచరీని 2019లో బంగ్లాదేశ్‌పై సాధించాడు. అప్పటి నుంచి పరుగుల కరువుతో సతమతమవుతున్నాడు.
గత 40 నెలల్లో కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. 241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. 139వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ సింగిల్ తీయగానే స్టేడియం మొత్తం హోరెత్తింది. కోహ్లి కూడా తన లాకెట్‌ను ముద్దాడి సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.
