హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్- ఎల్బీ నగర్, ఎల్బీనగర్ – -మియాపూర్ రూట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో మెట్రో రైలు సేవలు దాదాపు30 నిమిషాలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గంమధ్యలోనూ ఆగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రైళ్లు ఆగిపోవడంతో కొందరు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లో సేవలను పునరుద్దరిస్తామని సిబ్బంది అనౌన్స్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అరగంటకు పైగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు.. పునరుద్దరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది.

YES9 TV