ముదిగుబ్బ, యస్ 9
ముదిగుబ్బ మండలం లో అసంపూర్తి పీ.హెచ్.సీ కి మంత్రి సత్య కుమార్ వల్ల మోక్షం – ముదిగుబ్బ పీ.హెచ్.సీ నిర్మాణం కోసం రూ.1.69 కోట్ల నిధుల మంజూరు ఎన్నకల హామీని నిలబెట్టుకున్న సత్యకుమార్
ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యత అని నిరూపించిన మంత్రివర్యులు
ఎన్నికల హామీకి నిలువెత్తు నిదర్శనం – ముదిగుబ్బ PHC పూర్తి దిశగా రూ.1.69 కోట్లు ముదిగుబ్బ, ఏప్రిల్ 20:- ఎన్నికల్లో నాయకుడిని నమ్మి ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షను నెరవేర్చేవాడే నిజమైన ప్రజానాయకుడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ చాటిచెప్పారు. అసంపూర్తిగా ఉన్న ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిచేస్తానని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణంలో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.1.69 కోట్ల నిధులను మంజూరు చేయించి ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యత అని మంత్రి సత్యకుమార్ నిరూపించారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ (వి & ఎం)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణంలో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.1.69 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ 20/04/2026 తేదీతో అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నూతన పీ.హెచ్.సీ నిర్మాణ పనులు ప్రారంభించగా అనంతరం వచ్చిన జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో నిర్మాణం అసంపూర్తిగా మారింది. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి మండల ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా రాజకీయానికి ప్రాధాన్యమిస్తూ పిహెచ్సి నిర్మాణాన్ని విస్మరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, ప్రజల కష్టాలు తెలుసుకొని తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పి.ఎస్.సి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటికే ఎన్నో వాగ్దానాలను పూర్తిచేసిన మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, ముదిగుబ్బ పీ.హెచ్.సీ నిర్మాణానికి కోసం అనుక్షణం వివిధ శాఖలతో సంప్రదింపులు జరుపుతూ రూ.1.69 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ విషయమై ముదిగుబ్బ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సత్య కుమార్ యాదవ్ లాంటి నాయకుడు తమకు ఎమ్మెల్యేగా రావడం అదృష్టమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించకుండా పీ.హెచ్.సీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ఆరోగ్య గ్రాంట్లలో భాగంగా ఈ నిధులు విడుదల చేయబడినట్లు, ముదిగుబ్బలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన పనుల పూర్తి కోసం వినియోగించబడనున్నట్లు మంత్రి కార్యాలయం వివరించింది. ఈ నిధుల మంజూరుకు ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ గారి ప్రత్యేక చొరవ ప్రధాన కారణమైందని మంత్రి కార్యాలయం తెలిపింది. నియోజకవర్గంలో ఆరోగ్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలనే దృఢ సంకల్పంతో మంత్రి నిరంతరం అధికారులతో సమన్వయం చేస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించినట్లు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులు ఉండాలనే లక్ష్యంతో మంత్రి తీసుకున్న చర్యల ఫలితంగా ఈ అభివృద్ధి సాధ్యమైందని వివరించింది. ఉత్తర్వుల ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా నిధుల విడుదలకు అనుమతి ఇవ్వబడినట్లు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC)కు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ నిధుల ద్వారా ముదిగుబ్బ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు, మెరుగైన భవన వసతులు, సమయానికి చికిత్స అందే పరిస్థితులు లభించనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది
ముదిగుబ్బ పీహెచ్‌సీకి ‘మోక్షం’: రూ.1.69 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్!
