అనంతపురం జిల్లా, రాయదుర్గం.
—————————————–
మైనార్టీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యం
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు రాయదుర్గం వచ్చిన ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. టిడిపి లౌకిక పార్టీ అని మతసామరస్యాన్ని కాపాడుతున్న ఏకైక పార్టీ టిడిపి అని పేర్కొన్నారు.
హైదరాబాదులో మతోకల్లోహాలను అరికట్టిన ఘనత ఎన్టీఆర్ దే నని పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్ర హితం అభివృద్ధి కోసం బిజెపితో జత కట్టినట్లు తెలిపారు.
బిజెపితో జత కట్టడాన్ని తప్పు బట్టి మైనారిటీల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు కుట్ర పన్నుతుందని వైసీపీ పై మండిపడ్డారు.
కేసులు నుంచి తప్పించుకోవడానికి వైసిపి బిజెపితో లోపాయి గారి ఒప్పందం కుదుర్చుకుందని మండిపడ్డారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో జగన్ ఘోరంగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 సిబిఐ కేసుల్లో కోర్టుకెళ్లకుండా జగన్ జారుకుంటున్నాడంటే ఏమాత్రం బిజెపితో లోపాయి కార ఒప్పందం కుదుర్చుకున్నాడన్న విషయం స్పష్టమవుతుందన్నారు.
మైనార్టీ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ పార్థసారథి, శాసన సభ్యురాలు పరిటాల సునీత, బండారు శ్రావణి లు పాల్గొన్నారు
