సామాజిక సేవకు గుర్తింపు.. వెంకట రమణకు ప్రతిష్టాత్మక డాక్టరేట్

*సామాజిక సేవకు గుర్తింపు.. వెంకట రమణకు ప్రతిష్టాత్మక డాక్టరేట్*

అనంతపురం ,జూన్ 20: సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బి. వెంకట రమణ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది.

శనివారం ఊటీలోని జెమ్ పార్క్ హోటల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌తో పాటు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా బి. వెంకట రమణ ఈ గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. భవిష్యత్తులో కూడా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అణగారిన వర్గాల సాధికారత, సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

బి. వెంకట రమణకు లభించిన ఈ అరుదైన గౌరవం పట్ల జిల్లాలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం జిల్లా ప్రజలకు గర్వకారణమని కొనియాడారు.

Posted Under AP
Editor