అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా భోజనం: సీఎం సతీమణి రూ. 76 లక్షల విరాళంపై ప్రశంసలు!

అనంతపురం జిల్లా.

*అన్న క్యాంటీన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా..*

*క్యాంటీన్ లో శుచి శుభ్రత ఖచ్చితంగా ఉండాలన్న ఎమ్మెల్యే*

– ఆకలి విలువ తెలిసిన వారు ఎవరూ అన్న క్యాంటీన్లను మూసివేయరని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించిన నేపథ్యంలో అనంతపురంలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే దగ్గుపాటి పరిశీలించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నగరంలోని రైల్వే స్టేషన్ కు సమీపంలోని క్యాంటీన్ కు వెళ్లారు. అక్కడ కూలీలు, ఆటో కార్మికులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచి చూడటంతో పాటు క్యాంటీన్ లో పరిశుభ్రతను కూడా పరిశీలించారు. భోజనం చేసిన వారిని అడిగి రుచి ఇతర వివరాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఆకలి సమయంలో వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్న వారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఒక దేవుడిలా చూస్తున్నారన్నారు. అన్న క్యాంటీన్లతో తమకు 3పూటల ఆహారం దొరుకుతోందన్న కార్మికులు చెబుతున్నారన్నారు. గతంలో బయట చాలా ఖర్చులు భరించాల్సి వచ్చేదని.. చంద్రబాబు దేవుడిలా మాకు భోజనం అందేలా చేశారన్న ప్రజలే చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇలాంటి ప్రజల అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి ఎంతో గొప్ప హృదయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు రూ.76లక్షలు విరాళం అందించారన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరుపున సీఎం చంద్రబాబు దంపతులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు..

Posted Under AP
Editor