అనంతపురం జిల్లా,కలెక్టరేట్.
ప్రముఖ సంఘసంస్కర్తగా కొనియాడపడుతున్న మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతిని అక్షయ తృతీయ రోజు సోమవారం ఉదయం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు
చరణ్ శ్రీ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు
వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్ మాట్లాడుతూ భూమిపై శ్రమజీవులతోనే సమాజం నిర్మితమైందని మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారం అని చెప్పిన విశ్వ గురువు బసవేశ్వరుడేనని అన్నారు. కర్ణాటక వాసి అయినప్పటికీ మన భారత దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆచరించ
వలసినటువంటి సరళీ
కృతమైన జీవన విధానాన్ని మరియుబేధభావాలులేకుండాఅందరూసమానులేనని ఈ ప్రపంచానికి చాటిన గొప్ప మహనీయుడనితెలియజేస్తూ జాతికి చేసిన సేవలతో పాటు వారి జీవిత చరిత్రలోని పలు విషయాలను జాయింట్ కలెక్టర్ కొనియాడారు. అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగాయత్ అభివృద్ధి సంక్షేమం కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి తుల్జాపూర్ స్వప్న మాట్లాడుతూ 12వ శతాబ్దంలోని బసవేశ్వర మహానుభావుడు 12వ శతాబ్దంలో అనుభవ మంటప ను పేరుతో పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటుపరిచారని అలాగే కులమత వర్గ వర్ణ విభేదం లేకుండా అందరూ సమానులేనని మొట్ట
మొదటిగా చాటి చెప్పిన గొప్ప సంస్కర్త అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్య
మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ లు వీరశైవ సమాజం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా మహాత్మశ్రీబసవేశ్వరజయంతి వేడుకలు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు ,ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి జయ కుమార్ బాబు, రీజనల్ డైరెక్టర్ పర్యాటక శాఖ శ్రీమతి ఓబులమ్మ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సలీం భాష, ఆర్కియాలజీ ఏ.డి. స్వామి నాయక్, శిల్పారామం ఏ.వో. సుధాకర్, జిల్లా వీర శైవ సమాజం అధ్యక్షులు ఎం జి రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ గౌలి, సతీష్ కుమార్ పాటిల్, ఈశ్వర ప్రసాద్ ,చిరంజీవి, గోపాల్ గంగాధర, శివ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
