సీఎం చంద్రబాబు నాయుడు క్షేమం కోసం పది రోజులపాటు యాగాలు…..

అనంతపురం జిల్లా…

రాయదుర్గం నియోజకవర్గం..

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం చండీదేవి హోమం నిర్వహించారు.
స్థానిక జంబుకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో చండీదేవి హోమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా ఈ హోమం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి సంకల్పించిన ప్రతి అభివృద్ధి పని విజయవంతం కావాలని ఆ దేవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాలవ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోమం అనంతరం పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే రాష్ట్రం మళ్ళీ పురోభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఆయన ఆరోగ్యం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

Posted Under AP
Editor