Latest Posts

రాయదుర్గం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భరోసా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాలమంజూరుకు కృషి
– ఎమ్మెల్యే కాలవ

ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 22వ వార్డులో సోమవారం నిర్వహించిన “పేదలకు ఇళ్ల పండుగ” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదలకు ఇళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 1.50 లక్షల పేదల పక్కా ఇళ్లు, మరో లక్షటిడ్కో ఇళ్లను ప్రారంభించామన్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు విడతల్లో నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల ద్వారా పది లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించడం జరిగిందని గుర్తుచేశారు.
అయితే, 2019లో ప్రభుత్వం మారడంతో దాదాపు 6.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, పేదల ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించి, ఇప్పటికే రెండుసార్లు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో లబ్ధిదారుడికి రూ. 2.50 లక్షల సబ్సిడీ అందజేస్తున్నాయన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మంజూరై, ఆగిపోయిన 1007 టిడ్కో ఇళ్లను ఏడాది కాలంలో పూర్తి చేయించి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, మాజీ చేనేత డైరెక్టర్ టoకశాల హనుమంతు, మాజీ కౌన్సిలర్లు ఆనంద్, కడ్డిపూడి మహబూబ్ బాషా,కావలి రవి, భలే శంకర్, బండి భారతి, ప్రశాంతి, సుమలత, అగ్రహారం కిరణ్, మల్లి,జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor