Latest Posts

మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: రాయదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

*మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున*

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారం లోకిరాకముందు మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంలోనే ఈ ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం తో పాటు 12వ పిఆర్సి అమలు చేయాలని, పట్టణాలకు అనుకూలంగా కార్మికుల సంఖ్య పెంచి మున్సిపల్ కార్మికులకు పని భారం తగ్గించాలని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ పేరుతో అనారోగ్యంతో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తక్షణమే ఉపాధి కల్పించాలని,రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి,రిటైర్మెంట్ బెనిఫీట్స్ ను అందించాలని,. వారి బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలని. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, మున్సిపల్ కార్మికులకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు రాము తిప్పేరుద్ర వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

.

Posted Under AP
Editor