గాలివానకు దెబ్బతిన్న అరటి తోట: బాధిత రైతుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ భరోసా!

మంత్రి శ్రీ సత్య కుమార్ వై గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం నాయనపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త తొట్టి పేదయ్య గారికి చెందిన సుమారు 10 ఎకరాల అరటి తోట ఇటీవల కురిసిన అకాల వర్షాలు మరియు గాలివాన కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది. భారీ వర్షపాతం వల్ల అరటి మొక్కలు నేలకూలిపోవడం, పండ్లకు నష్టం కలగడం వంటి పరిస్థితులు ఏర్పడి రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో బాధిత రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారి సూచనల మేరకు ప్రభుత్వ అధికారులతో కలిసి మంత్రి గారి నియోజకవర్గ బాధ్యుడు హరీష్ బాబు గారు, తాడిమర్రి మండల అధ్యక్షుడు దేవర రాము గారు, ప్రధాన కార్యదర్శి పెద్దకోట్ల ఆనంద్ గారు, ఏకైక వేదిక సంచాలకుడు అణగుర్తి రమణ గారు, మార్కెట్ యార్డు సంచాలకుడు కొంక నాగార్జున గారు ఘటన స్థలాన్ని సందర్శించి పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకొని, ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న సహాయం మరియు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా కల్పించారు

Posted Under AP
Editor