*23-3-2026*
*భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తాం.( PDSU )*
*యువత ఆదర్శప్రాయుడు భగతసింగ్*…
*పీ.డీ.ఎస్.యూ విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్,*
ఈరోజు కణేకల్ పట్టణంలోని డా ” బిర్ అంబేద్కర్ గురుకుల (బాలురు ) పాఠశాల లో భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది *అనంతరం పీడీ ఎస్ యూ విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ* రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వారిలో అగ్ర గన్యలు కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ లు. సామ్రాజ్యవాదుల ఆదిపత్యం పీకి పారేయాలి అంటే భారతదేశంలో ఒకే ఒక ఆయుధం అది శ్రామిక వర్గ విప్లవమని భగత్ సింగ్ వందేళ్ళ క్రితమే చెప్పాడు.బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి మాతృభూమి విముక్తి కోసం ఎందరో వీరులు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించారు. వారిలో అగ్ర గన్యులు కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ లు.1931 మార్చి 23న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వీరు ముగ్గురుని క్రూరంగా ఉరి తీసారు. మాతృదేశ విముక్తి కోసం ఎన్ని సారులు అయినా ఉరితాలను పూలమాలుగా స్వీకరిస్తానని భగత్ సింగ్ ధైర్యంగా ప్రకటించాడు. మార్క్సిజం అధ్యయనం చేసి దేశానికి స్వాతంత్రం రావాలంటే దేశంలో శ్రామిక వర్గ విప్లవాన్ని విజయవంతం చేయాలని ఆనాడు చెప్పిన మహామేధావి.ఒక తెల్ల బద్మాస్ స్థానంలో నల్ల బద్మాస్ అధికారంలో రావడం స్వాతంత్రం కాదని ఆకలి కేకలు లేని, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని,అణిచేవేతలేని సమ సమాజాన్ని సాధించడం ద్వారానే నిజమైన స్వాతంత్రం వస్తుందని చాటాడు.వీరిది దేశభక్తి కలిగిన కుటుంబం.భగత్ సింగ్ తన ఏడవ యేటనే తన తండ్రితో పాటు పొలం కు వెళ్లి గోధుమ పంటను చూసి తుపాకీలు పాతితే మరిన్ని తుపాకీలు వస్తాయి కదా అని అన్నాడు. విద్యార్థులందరూ కూడా భగత్ సింగ్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU ) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ కణేకల్ మండలం అధ్యక్షులు వన్నూరుస్వామి PDSU నాయకులు సురేష్, పవన్, వనిచంద్ర, వంశీ, ఆనంద్, శశి, రామాంజి,తదితరులు పాల్గొన్నారు,
