అయ్యా వీరభద్రయ్య న్యాయానికి చోటు ఇది, పేకాట ఆడే వారికి కాదు ,,,,,,,!!!!
కాలువ దగ్గర టెంట్లులో పేకాట, సన్నిధానం పక్కన వాహనాలు నిలిపివేత.
వీరభద్రుడు స్వామి దేవాలయం దగ్గర వాహనాల నిలిపివేతను చూసి, చూడనట్టు పోతున్న రక్షక బటులు
ఇదంతా చూసిన గ్రామస్తులు, పైవారికి అర్జీలు అర్పించిన, ఆలకించని నాదుడే లేడు
yes9tv న్యూస్
ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం ఉండబండ గ్రామ పరిధిలో వీరభద్ర స్వామివారి ఆలయానికి కొంత దూరంలో కాలువ పక్కన గుంపులు, గుంపులుగా గుడారులు వేసి పేకాట నిర్వహిస్తున్నారు. అక్కడ గ్రామస్తులు సూచనల మేరకు ఆటనిర్వాహకులు ఎవరిని అడిగితే వన్నూరు స్వామి తండ్రి పేరు మారెప్ప, వారికి అనుగుణంగా ఒక రక్షకభటుడు అయినా ఎస్ బి కానిస్టేబుల్ నరసింహులు వీరిద్దరి ఆధ్వర్యంలో పేకాట అద్భుతంగా నడుస్తుంది అని గ్రామస్తులు తెలియజేయడం జరిగినది. ఈ పేకాట కు చాలామంది దూరం పు ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు, ఈ ప్రాంతపు వారు బళ్లారి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, ప్రొద్దుటూరు, బెంగళూరు మరియు తెలంగాణ నుండి చాలామంది వాహనాలలో ఇక్కడకు వచ్చి పేకాట లక్షలాది రూపాయలలో ఆడుతున్నారు, వారు ఇక్కడికి రావడానికి ఒక కిలోమీటర్ దూరంలో వారి మొబైల్ ఫోన్లు, అన్నిటినీ స్వీకరించి పేకాట ఆడడానికి పంపిస్తారు. ఒకవేళ పేకాటలో ఓడిపోయిన మన దూరపు అతిథులకు మామూలుగా 10/- రూపాయల వడ్డీతకి, అనంతపురం నుంచి శీన, అలాగే బెస్త నాగరాజు , పుల్లయ్య నాగసముద్రం వీరు వస్తువులను కుదవ ఉంచుకొని , ఆ వస్తువుకు తగిన రుసుము ఆడడానికి అందిస్తారు.
“అక్కడ యువత భవిష్యత్తు పేకాట కి అంకితమై పోతున్నారు”
ఈ మధ్యకాలంలో ఉండబండ కి పక్కన ఉన్న గ్రామాల నుండి భారీ సంఖ్యలో యువత పేకాట వైపు మొగ్గు చూపుతున్నారు, వారి ఇంటిలోని ఆభరణాలను, వాహనాలను, మొబైల్ ఫోన్లోను, కూడా తాకట్టు పెట్టి పేకాటకు లక్షల కొద్ది సొమ్మును పోగొట్టుకుంటున్నారు, ఈ యువతరం పేకాటక బానిసై మందు తాగడానికి అలవాటు పడి దొంగతనాలు చేయడం కూడా మొదలు పెడుతున్నారు, ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధానంలో నీ హుండీలను కూడా దొంగలించి అందులో ఉన్న నగదు ను తీసుకొని ఈ పేకాటకు తరలివస్తున్నారు, ఈ పేకాటలో గెలిస్తే ఐదు లక్షలు పోతే దొంగలించిన సొమ్ము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
“గ్రామస్తులు భయభ్రాంతులై పోతున్నారు”
ఉండ బండ దగ్గర వీరభద్రుని సన్నిధానం సమీపంలోజరుగుతున్న పేకాట వలన అక్కడికి విపరీతమైన వాహనాలు రావడం, అక్కడ ఉన్న ప్రజలు చూసి ఎందుకు ఇన్ని వాహనాలు వస్తున్నాయి అని ఆరా తీయగా అక్కడకి పేకాట ఆడడానికి వస్తున్నారు అని తెలిసినది. వాహనాలు రావడం వలన అక్కడ ఉన్న ప్రజలు భయం బ్రాంతులై పోతున్నారు ఎందుకనగా అక్కడ జరిగే పేకాట లో డబ్బులు పోగొట్టుకొని ఉన్నవారు దొంగతనాలకు పాల్పడుతారని భయాందోళనలో ఉన్నారు.
“అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోని అధికారులు”
ఉండ బండ గ్రామంలోని ప్రజలు ఎస్పీ కార్యాలయానికి అర్జీలను అందించిన ఎటువంటి స్పందన లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాన్ని అందజేసిన ఫలితం లేకుండా పోయింది.
ఇంత జరుగుతున్నా కూడా పాల్తూరు లోని రక్షకబటలు కేంద్రంలో పట్టించుకోవడంలేదని గ్రామస్తులు తీవ్రమైన ఆవేదనకు గురి అవుతున్నారు.
“భక్తులకు జరుగుతున్న ఇబ్బందులు”
ఉండబండ సమీపంలో వీరభద్ర స్వామి సన్నిధానాన్ని దర్శించుకోవడానికి వస్తున్న భక్తాదులకు చాలా అసౌకర్యం కలుగుతుంది అని భక్తాదులు చెప్పడం జరిగినది. అక్కడ పేకాట జరగడంతో భక్తుల వాహనాలు నిలుపుకోవడానికి కూడా సరైన పార్కింగ్ ప్లేస్ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. వీరభద్రుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కూడా చాలా తక్కువ కావడం గమనార్హం. ఎందుకనగా అక్కడ జరుగుతున్న పేకాట వలన భక్తాదులు రావడానికి భయపడుతున్నారు.
