ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ బుధవారం మల్లేపల్లి, తప్పేట వారి పల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొడి నెలల్లో విత్తనాలు విత్తే పద్ధతి పిఎండిఎస్ (PMDS)ను నిర్వహించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు కంది,ఆముదం, పెసర,అలసంద, వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసిన ప్రతి రైతూ పంటల బీమాను ఈనెల ఆఖరిలోగా చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీంద్ర,వ్యవసాయ సిబ్బంది జహీర్,అనీల్,లక్ష్మీ, సమీర్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు…
గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం..
