భగత్ సింగ్ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించిన :AISA, PSU నాయకులు.

ఉరవకొండ పట్టణంలో ఈరోజు అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (PSU) విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్బంగా PSU జిల్లా అధ్యక్షులు భాస్కర్,AISA ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్షులు మంజు మాట్లాడుతూ రవి అస్తమించని….. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వారిలో అగ్ర గన్యలు కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు. సామ్రాజ్యవాదుల ఆదిపత్యం పీకి పారేయాలి అంటే భారతదేశంలో ఒకే ఒక ఆయుధం అది శ్రామిక వర్గ విప్లవమని భగత్ సింగ్ వందేళ్ళ క్రితమే చెప్పాడు.బ్రిటిష్ సామ్రాజ్యవాదు ల నుండి మాతృభూమి విముక్తి కోసం ఎందరో వీరులు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించారు. వారిలో అగ్ర గన్యులు కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ లు. 1931 మార్చి 23న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వీరు ముగ్గురుని క్రూరంగా ఉరి తీసారు. మాతృదేశ విముక్తి కోసం ఎన్ని సారులు అయినా ఉరితాలను పూలమాలుగా స్వీకరిస్తానని కామ్రేడ్ భగత్ సింగ్ ధైర్యంగా ప్రకటించాడు. మార్క్సిజం అధ్యయనం చేసి దేశానికి స్వాతంత్రం రావాలంటే దేశంలో శ్రామిక వర్గ విప్లవాన్ని విజయవంతం చేయాలని ఆనాడు చెప్పిన మహామేధావి.ఒక తెల్ల బద్మాస్ స్థానంలో నల్ల బద్మాస్ అధికారంలో రావడం స్వాతంత్రం కాదని ఆకలి కేకలు లేని, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని, అణిచేవేతలేని సమ సమాజాన్ని సాధించడం ద్వారానే నిజమైన స్వాతంత్రం వస్తుందని చాటాడు అన్నారు. ఈ కార్యక్రమం లో PSU నియోజకవర్గం అధ్యక్షులు తులసి, AISA నాయకులు చరణ్, శివ, వంశీ,అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
YES9 TV