తాడిమర్రి(yes9tv) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పారవేటి ఉత్సవం
అంగరంగ వైభవంగా నిర్వహణ
తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక పారవేటి ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనభాగ్యం పొందారు.
ఉత్సవంలో భాగంగా స్వామివారికి విశేష పూజలు, అలంకరణలు నిర్వహించబడ్డాయి. గ్రామస్థులు అందరూ ఐక్యంగా పాల్గొని ఉత్సవాన్ని సంపన్నం చేశారు.
స్వామివారి అనుగ్రహంతో గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని భక్తులు ప్రార్థించారు.
ఏకపాదంపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పారవేటి ఉత్సవం….
