మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ రికార్డు: రెండు రోజుల్లో 17 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ మ్యూజిక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. చిరంజీవి మాస్ మరియు క్లాస్ కాంబినేషన్‌ని ప్రెజెంట్ చేసిన ఈ పాట రికార్డుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ పాట మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి, దేశవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఇది చిరంజీవి పాన్-ఇండియా క్రేజ్‌కి నిదర్శనంగా నిలిచింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మ్యూజికల్ ఫీస్ట్‌లో చిరంజీవి తన యంగ్ ఎనర్జీ, మ్యాజికల్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టారు. ఆయన, హీరోయిన్ నయనతార కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడముచ్చటగా ఉంది. భీమ్ సీసిరోలియో స్వరపరిచిన ఈ పాటలో ఎలక్ట్రానిక్ బీట్స్‌, సింథ్ సౌండ్స్‌, ట్రెడిషనల్ పెర్కషన్ మేళవింపు అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం చిలిపితనం, సరదా, ఫన్ తో ఆకట్టుకుంది.

సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ వాయిస్‌లోని నాస్టాల్జిక్ టచ్‌, శ్వేతా మోహన్ వాయిస్‌లోని ఎలిగెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. షైన్ స్క్రీన్స్‌, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Editor