ఆపిల్ ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ హైదరాబాద్ సమీపంలో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2025 నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఫాక్స్‌కాన్ చైనా వెలుపల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణలోని తయారీ కేంద్రంలో 2025 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటికే ట్రయల్ తయారీని ప్రారంభించిందని పలు నివేదికలు వస్తున్నాయి. ఈ అభివృద్ధి భారతదేశంలో ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేయడంలో కీలకం కానుంది. యాపిల్ భారతదేశంలో తయారీకి ఇది మొదటి వెంచర్ కాదు. అక్టోబర్‌లో భారతదేశంలో ఐఫోన్ 17 బేస్ మోడల్ కోసం కంపెనీ ప్రారంభ ఉత్పత్తి దశలను ప్రారంభించింది. Apple కోసం వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌ల స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఎయిర్‌పాడ్‌లను ఉత్పత్తి చేయనున్నారు.
ఐఫోన్ తయారీదారు భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నందున, యాపిల్ తయారీ ఆశయాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడలు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోది. ఇప్పటికే రేవంత్ సర్కార్ తెలంగాణకు అనేక పెట్టుబడులు తీసుకొచ్చింది. గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్, కరీంనగర్ వంటి నగరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చాలా మంది కోరుతున్నారు.
హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు వరంగల్, కరీంనగర్ నగరాలను అభివృద్ధి చేస్తే బాగుటుందని చాలా అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వరంగల్, కరీంనగర్ అభివృద్ధి చర్యలు ప్రారంభించింది