పేర్ని నాని అనూహ్య నిర్ణయం – బియ్యం కేసు ఎఫెక్ట్..!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ పేర్ని నాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం పైన కేసు నమోదు అయింది. అరెస్ట్ తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో, అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం వెళ్లింది. ఇదే సమయంలో పేర్ని నాని రాజీ ఫార్ములా తెర మీదకు తీసుకొచ్చారు. కేసు నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

బియ్యం కేసు

వైసీసీ సీనియర్ నేత పేర్ని నాని సతీమణి జయసుధ పై సొంత గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసు నమోదైంది. పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌరసరఫరాల సంస్థకు అద్దెకు ఇచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన 3 వేల 708 బస్తాల మేర రేషన్‌ బియ్యం మాయమయ్యాయి. దీని పైన పోలీసులు కేసు నమోదు చేసారు. సివిల్ సప్లయిస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో పేర్ని నాని కొత్త ప్రతిపాదన చేసారు. ఆయన కోటి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించినట్టు సమాచారం.

 

బెయిల్ ప్రయత్నాలు

పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉన్న గోడౌన్‌లను పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. గత నెలాఖరున నిర్వహించిన తనిఖీల్లో ఈ గోడౌన్‌ల నుంచి 187 టన్నుల పీడీఎస్‌ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. అయితే అధికారులు తనిఖీలకు రాకముందే పేర్ని నాని భార్య జయసుధ స్పందించారు. ఆ గోడౌన్‌లోని బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, దానికి డబ్బు చెల్లిస్తానని పౌరసరఫరాలశాఖ అధికారులకు లేఖ రాశారు. కాగా, ఇప్పటికే కేసు నమోదు కావటంతో..బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే.. బయటపడేందుకే పేర్ని నాని ప్రభుత్వానికి డబ్బు చెల్లించినట్టు తెలుస్తోంది.

 

రూ కోటి చెల్లింపు

దీని పైన అధికారులు ఎక్కడా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించటం లేదు. అయితే, అటు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్ని నాని నేతృత్వం వహించాల్సి ఉంది. కానీ, నానితో పాటుగా ఆయన కుమారుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో, ఇప్పుడు కోటి రూపాయాలు చెల్లించినట్లు జరుగుతున్న ప్రచారం పైన నాని స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Posted Under AP
Editor