సినీనటుడు మరియు మాజీ యం.పి అయిన మోహన్ బాబు @భక్తవత్సలనాయుడు గత రాత్రి తన ఇంటికి న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన మీడియా మిత్రులపైన భౌతిక దాడిచేయడాన్ని అసోసియేషన్ ఆప్ ఆల్ ప్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది.కుటుంబ తగాదాలను వీదిలోకి తెచ్చి అభాసుపాలైన మోహన్ బాబు తీరును ఆప్ నిరశిస్తోంది.సెలబ్రిటీలు కాబట్టి వారి గొడవలను కవర్ చేయకూడదంటు మీడియా పై దాడి చేయడం అనాగరిక చర్యగా అభివర్ణించారు ఆప్ జాతీయ అధ్యక్షుడు కంచం ప్రభాకర్ రెడ్డి. జర్నలిస్టుల పైన దాడులకు పాల్పడిన నాయకులు కానీ సినీ నటులు కానీ మూల్యం చెల్లింకోకతప్పదన్నారాయన.మోహన్ బాబు సినిమాలో విలన్ అనుకున్నాంగానీ నిజజీవితంలో కూడా ఆయన విలనే అని భావించాల్సి వస్తోందన్నారు ప్రభాకర్ రెడ్డి. మీడియా ప్రతినిధులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబు పై క్రిమినల్ కేసులు పెట్టాలని ,బేషరతుగా మోహన్ బాబు మీడియా కు క్షమాపణ చెప్పాలని ఆప్ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శి దుడ్డు నారాయణ డిమాండ్ చేశారు.మోహన్ బాబు దాడీలో గాయపడిన టీవీ9 టీవీ5 మిత్రులకు ఆప్ సానుభూతి ప్రకటించింది.