Yes. 9tv.యాడికి
యాడికి మండల కేంద్రంలో
జె.సి. అస్మిత్ రెడ్డి మంగళవారం పర్యటించారు స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయం పక్కన ఉన్న టి.డి.పి. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో పలు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు తాపీ మేస్త్రీలు ఇసుక కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి అవసరాల నిమిత్తం ఇసుక తోలుకోవచ్చని కానీ ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే తెలిపారు. యాడికి బుగ్గ రోడ్డు చాలా అధ్వానంగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు త్వరలో యాడికి బుగ్గ రోడ్డుకు మహర్దశ పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. యాడికి కాలువకు నీరు వదలాలని రైతులు ఎమ్మెల్యేను కోరగా త్వరలోనే యాడికి కాలువకు నీరు విడుదల చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, పరిమి చరణ్, రవి కుమార్ రెడ్డి, నాగ ముని రెడ్డి, రాజశేఖర్ నాయుడు, రామచంద్రారెడ్డి, విజన్ స్కూల్ విశ్వనాథ్, సెల్ పాయింట్ చాంద్ భాషా, గండికోట లక్ష్మణ్, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
