అసెంబ్లీలో ప్రవేశపెట్టదలచుకోని చంద్రబాబు..!

ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టదలచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.

ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. మూడు నెలల కాలానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభకు సమర్పిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టనుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Editor