రాహుల్ గాంధీ ప్రధానిలా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు..

ఎన్నికల్లో ఓడిపోయినా సంబరాలు చేసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సోమాజీగూడ జయ‌గార్డెన్‌లో నిర్వహించిన సికింద్రబాద్ సెంట్రల్ జిల్లా విసృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సిద్ధాంతపరంగా నడుచుకునే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీపై కాంగ్రెస్ కావాలనే ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు.

Editor