కజికిస్థాన్‌ లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం

కజికిస్థాన్‌ లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ నిర్వహిస్తున్న కజకిస్థాన్ బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 28 మంది కార్మికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

మీథేన్ పేలుడు సంభవించిన తర్వాత, కోస్టెంకో గనిలోని 252 మందిలో 206 మందిని ఖాళీ చేయించారు. 21 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదు. ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల జరగ్గా స్థానిక కాలమానం ప్రకారం ఉందయం 08:00 గంటలకు ప్రమాదం సంభవించింది.

లక్సెంబర్గ్-ఆధారిత బహుళజాతి ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. ఇది కరగండ ప్రాంతంలో ఎనిమిది బొగ్గు గనులను, మధ్య ఆసియాలోని ఉత్తర కజకిస్తాన్‌లో మరో నాలుగు ఇనుప ఖనిజం గనులను నిర్వహిస్తోంది. ArcelorMittal Temirtau నిర్వహించే సైట్‌లలో అగ్నిప్రమాదం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఆగస్టులో అదే గనిలో మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు, నవంబర్ 2022 లో మరొక ప్రదేశంలో మీథేన్ లీక్ కారణంగా ఐదుగురు మరణించారు.

ఆర్సెలార్‌మిట్టల్‌తో తమ ప్రభుత్వం పెట్టుబడి భాగస్వామ్యానికి ముగింపు పలుకుతోందని కజఖ్ ప్రెసిడెంట్ కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్ శనివారం తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన అక్టోబర్ 29న జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ఈ కంపెనీని జాతీయం చేసేందుకు ఒక ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్సెలార్ మిట్టల్ తన సొంత ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించింది.

“ఆర్సెలార్ మిట్టల్ టెమిర్టౌ భవిష్యత్తు గురించి రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయని, రిపబ్లిక్ ఆఫ్ కజాఖ్స్తాన్‌కు యాజమాన్యాన్ని బదిలీ చేసే లావాదేవీకి సంబంధించిన ప్రాథమిక ఒప్పందంపై ఇటీవల సంతకం చేశాయని కజకిస్తాన్ ప్రభుత్వం ఈరోజు ముందుగా తెలియజేసినట్లు ఆర్సెలార్ మిట్టల్ ధృవీకరించిందని” ఓ వార్త సంస్థ పేర్కొంది.

YES9 TV