పెడనలో అల్లర్లకు పవన్ కళ్యాణ్ కుట్ర.. దత్తతండ్రి మాస్టర్ స్కెచ్: మంత్రులు ఫైర్!!

కృష్ణా జిల్లా పెడనలో జరగబోయే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పై దాడి చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇదంతా తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర అని, దాడి చేయించుకునేది ఆయనే అని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విరుచుకుపడుతున్నారు.

అవనిగడ్డ సభ ప్లాప్ కావడంతో పవన్ కళ్యాణ్ దిగులు పడుతున్నారని, అంగళ్లు మాదిరిగా గొడవలను సృష్టించడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. పెడనలో జరగబోయే వారాహి యాత్రపై పవన్ కళ్యాణ్ తనకు తానే దాడులు చేయించుకుని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీతో జత కట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలకు తెర తీస్తున్నారని విమర్శించారు.స్వయంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులను పెడనలో జరిగే సభకు పిలిపించుకొని, తనపై రాయి, రప్ప వేయించుకొని ప్రభుత్వంపై బురద చల్లాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.

ఈ సలహా పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని పేర్కొన్న అంబటి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ఇంతకుముందు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని నిరూపించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.

వారాహి యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం లేదని, ఇది జైలులో ఉన్న దత్త తండ్రి మాస్టర్ స్కెచ్ అంటూ జోగి రమేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాటలను నమ్మొద్దని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను నమ్మొద్దని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. పెడన ప్రజలు శాంతికాముకులు అని పేర్కొన్న ఆయన అక్కడి ప్రజలకు రాళ్లు వేయాల్సిన అవసరం లేదన్నారు.

Posted Under AP
YES9 TV