మంచు మోహన్ బాబు తనయుడిగా ‘ బిందాస్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. మొదటి సినిమాతో హిట్ అందుకున్న మనోజ్ తర్వాత వరుస సినిమాలు చేశాడు.
అందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో కూడా కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మనకు తెలిసిందే మంచు మనోజ్ మొదటగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నాడు.
ఇక ఇటీవల మంచు మనోజ్ ప్రముఖ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి. అయితే మొదటగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మంచి ఫ్యామిలీకి ఇష్టం లేదు కానీ లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి వీళ్ళ పెళ్లి చేసింది. మార్చి మూడవ తేదీన లక్ష్మీ ప్రసన్న నివాసంలో పెళ్లి జరిగింది. దీనికి అతి కొద్ది ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి మోహన్ బాబు సతీసమేతంగా విచ్చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లికి చివరి నిమిషంలో మోహన్ బాబు రావడంతో ఆయనకు ఇష్టం లేని మాట వాస్తమే అన్న వాదనలు వినిపించాయి.